ఆదాయ వంతంగా కొండ పొలం
– ప్రకృతి ఆధారంగా పంటలు పండించుదాం
– జల వనరులను కాపాడుకుందాం
– అడవి వ్యవసాయం తో తరతరాలకూ ఆదాయం
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
ఆదాయ వంతంగా కొండ పొలం వ్యవసాయం చేయడం ఆనందంగా ఉంది అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరాబు గ్రామం లో సనపల జగదీష్ , విష్ణు ప్రియ దంపతులకు చెందిన “సమతుల్య” అడవి వ్యవసాయాన్ని సందర్శించడం జరిగింది అన్నారు. అక్కడ ప్రకృతి ఆధారంగా కొండల్లో నుండి వస్తున్న జల వనరులను భూగర్భం లోనికి ఇంకే విధంగా చేస్తూ, అడవిని ఏ మాత్రం తొలగించ కుండా పంటలు పండించడం ఇక్కడ విశేషంగా ప్రతి ఒక్కరినీ ఆకర్షించే, స్పందింపచేసే అంశం అన్నారు. వర్షం నీటిని భూగర్భం లోనికి వెళ్ళె విధంగా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వి, భూమి కోతను నివారిస్తూ పంటలు పండించడం విశేషం అన్నారు. ఇక్కడ పంటలు పండించే అడవి వ్యవసాయం తో తరతరాలకూ ఆదాయం లభిస్తుంది , శ్రామికులు ఎక్కువ మంది అవసరం ఉండదు అని వివరించారు. రసాయన ఎరువులు, రసాయన కలుపుతీత ముందులు, రసాయన క్రిమి సంహారకాలు వినియోగించకుండా పంటలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఇక్కడ లభ్యమవుతున్నాయన్నారు
ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ తనూ, తన భార్య ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివుకున్నామన్నారు. ఒక సహజసిద్ధమైన వాతావరణం లో జీవించాలి అనె ఆలోచనతో ఈ విధంగా అడవి వ్యవసాయం చేయడం జరుగుతుంది అన్నారు. దీని ద్వారా చాలామంది యువతనూ, రైతులనూ ప్రభావితం చేసి సమస్త జీవరాశి మనుగడకు కృషి చేయాలని అనుకుంటున్నామన్నారు.
ఈ కొండ పొలాన్ని గోవర్ధనపురం గోశాల ప్రతినిధి దొడ్డ మహేష్, మ్యాంగోమేన్ అప్పాజీ, ప్రకృతి వ్యవసాయదారులు నరేష్ తదితరులు సందర్శించారు.
ఆదాయ వంతంగా కొండ పొలం – ప్రకృతి ఆధారంగా పంటలు పండించుదాం#vvwnews
2