*మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై “తెలుగు శక్తి” విమర్శనాస్త్రాలు*

by vvwnews.com

*శవం కనిపిస్తే చాలు… వైయస్ జగన్ రాబందులా వాలిపోతారు*

*ఐదేళ్ల పాలనలో స్వరూపానంద సూచనలతో దేవాదాయ శాఖను భ్రష్టు పట్టించారు*

*సింహాచలంలో అనువంశిక ధర్మకర్తను తప్పించి చరిత్ర హీనులయ్యారు*

*ఇప్పుడేమో వైయస్ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు*

*మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై “తెలుగు శక్తి” విమర్శనాస్త్రాలు*

విశాఖపట్నం : ఇప్పటివరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తనదైన శైలలో నిప్పులు చెరిగారు. దేవదాయ శాఖను, సింహాచలన్నీ భ్రష్టు పట్టించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. శుక్రవారం ఉదయం డాబాగార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఐదేళ్లపాటు పీడించుకుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు శారదా పీఠానికి అధిపతిని అని చెప్పుకున్న స్వరూపానంద సేవలో తరించిందన్నారు. దేవదాయశాఖ కార్యకలాపాలు మొత్తం స్వరూపానంద చేతికి వెళ్ళాయని ఆరోపించారు. చివరకు.. స్వరూపానంద సూచనలతోనే ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తను కూడా మార్చేసిన నీచమైన చరిత్ర వైయస్ జగన్మోహన్ రెడ్డి ది అన్నారు. తద్వారా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల దృష్టిలో వైఎస్ జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి సింహాచలం ఘటనపై మొసలి కన్నీరు కార్చడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. సింహాచల చరిత్రలో ఎప్పుడూ కూడా అవాంఛనీయఘటన సంభవించలేదని ప్రకృతి విపత్తు కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షానికి సింహాచలంలో గోడ కూలిపోయింది అన్నారు. మరోవైపు ఇదే అంశంపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కూడా కొనసాగిస్తోందని తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుని వారి కన్నీటిని తుడిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, మానసిక రోగి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాబందులా వాలిపోయారన్నారు. ఇప్పుడే కాదు ఏ ఘటనలో ఎవరు ప్రాణాలు కోల్పోయినా.. తనకు లాభం ఉంటుందంటే వైయస్ జగన్ రాబందులా వాలిపోతారని తీవ్ర వ్యాఖ్య చేశారు. అసలే బాధలో ఉన్న బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి.. పుండు మీద కారం జల్లే విధంగా వ్యవహరించారని బి.వి.రామ్ విమర్శించారు. వైయస్ జగన్ తానా అంటే తందానా అన్నట్టు.. బొత్స సత్యనారాయణ, కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి గుడివాడ తదితరులు డ్రామాను మరింతగా రక్తి కట్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా శవ రాజకీయాలు మాని హుందాగా ప్రవర్తించాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఏది ఏమైనప్పటికీ సింహాచలంలో సంభవించిన దుర్ఘటన అత్యంత బాధాకరమని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

*పరిహారం బాద్యులైన అధికారుల నుంచే వసూలు చేయాలి*

సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం 25 లక్షలు కాకుండా 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం బాద్యులైన అధికారుల నుంచే వసూలు చేయాలన్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న వారిలో అనేక మందికి సర్టిఫికెట్స్ కూడా లేవన్నారు. డిప్యూటీ ఇంజనీర్ శ్రీహరి రాజు క్లీనర్ గా, ఎక్జ్ క్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు ఎన్.ఎం.ఆర్ గా గతంలో పనిచేసేవారన్నారు. ఇంచార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న రామచంద్ర మోహన్ అవినీతి పరుడన్నారు.

*పల్లా ఆదివారం ఉదయం 11 గంటల హోటల్ దశపల్లా లో చర్చకు సిద్ధం*

తనను వైసీపీ కోవర్ట్ అని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆరోపించారని.. ఇదే విషయమై శుక్రవారం చర్చకు సిద్ధం అని ప్రకటించాననన్నారు. అయితే పల్లా గాని అతని అనుచరులు గాని వేదికను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం 11 గంటల హోటల్ దశపల్లా లో చర్చకు సిద్ధంగా ఉంటానన్నారు. అప్పుడు కూడా చర్చకు రాకపోతే మాత్రం కోవర్ట్ అంశాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళతానని రామ్ తెలిపారు.

*ఎమ్మెల్యే వంశీతో బి.వి.రామ్ భేటీ*

విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో శుక్రవారం భేటీ అయ్యారు. దక్షిణ నియోజకవర్గంలో మీ స్థాయిని తగ్గించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రయత్నం చేస్తున్న విషయం.. టీడీపీ, జనసేన పార్టీ ల అధినేతలకు తెలియజేయాలని.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి రామ్ సూచించారు. ఈ విషయంపై తాను కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలియజేశారని రామ్ పేర్కొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles