సింహాచలం ఘటనపై స్పందించిన వైసీపీ నాయకులు తక్షణ చర్యలు తీసుకోవాలి అంటున్నారు

by vvwnews.com

సింహాచలంలో కొండమీద జరిగిన ప్రమాద స్థలం ని శాసన మండలి సభ్యులు ప్రతి పక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు , జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు శాసనమండలి సభ్యులు వరుదు కళ్యాణి , కుంభ రవి బాబు శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్ , చింతలపూడి వెంకటరామయ్య, సమన్వయకర్త తిప్పల దేవాన్ రెడ్డి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు పరిశీలించారు.
సింహాచలంలో గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, వరుదు కళ్యాణి, గుడివాడ అమర్నాథ్ చిన శ్రీను.
బొత్స సత్యనారాయణ పాయింట్స్
ప్రమాదం యాదృచికంగా జరగలేదు..
పబ్లిసిటీ పిచ్చి వలన ప్రమాదం జరిగింది..
తిరుపతిలో, సింహాచలంలో జరిగిన ప్రమాదాలు దీనికి ఉదాహరణ.
జరిగిన సంఘటన చాలా బాధాకరం.
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది.
7 మరణాలను ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నాం..
చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి..

Use Social Media to Spread the Word about Our News

related articles