జగన్ వీరాభిమానికి వాసుపల్లి రూ.10000 సాయం కార్యకర్తల కష్టంలో దక్షణ మాజీ ఎమ్మెల్యే దాతృత్వం వాసుపల్లి

by vvwnews.com

జగన్ వీరాభిమానికి వాసుపల్లి రూ.10,000 సాయం

– కార్యకర్తల కష్టంలో దక్షణ మాజీ ఎమ్మెల్యే దాతృత్వం

* వాసుపల్లి సేవలు వెలకట్టలేనివి.. ప్రశంసిస్తున్న వైసిపి శ్రేణులు

వాసుపల్లి గణేష్ కుమార్ అందిస్తున్న నిరంతర ఆర్థిక సహాయం, పలు సేవా కార్యక్రమాలుకి ప్రజలతోపాటు దక్షిణ వైసీపీ శ్రేణులు కూడా ఫిదా అవుతున్నారు. దక్షిణ ప్రజలకు మాత్రమే కాకుండా తనతో పాటు నడిచే వైసిపి నాయకులకు కార్యకర్తల కష్టాల్లో అండగా ఉంటున్నారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని, దక్షిణ బీసీ సెల్ అధ్యక్షుడు బొండదా వెంకటరావు భార్య అనారోగ్య నిమిత్తం అవసరమైన మందుల ఖర్చులకు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి ఇంటికి వెళ్లి యూరాలజీ సమస్యతో బాధపడుతున్న వెంకట్రావు భార్య బొండదా సత్యవతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని వాసుపల్లి గణేష్ కుమార్ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ నిన్న చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జననేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం తెలుసుకునీ భయంతో ప్రభుత్వం పాతిక లక్షలు ప్రకటించిందన్నారు. కానీ ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తున్నామని, తక్షణమే బాధితులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వకపోతే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక మిగిలిన రూ. 75 లక్షలు అందిస్తామని జగనన్న ప్రకటించడం గర్వకారణం అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పిదాలవలనే నేడు ఏడు ప్రాణాలు బలిగోన్నాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని ప్రజల సంక్షేమ పాలనపై దృష్టి సారించాలని వాసుపల్లి హితవు పలికారు. ప్రజల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భరత్, 29వ వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసు, 30వ వార్డ్ ప్రెసిడెంట్ దశమంతుల మాణిక్యాలరావు, సౌత్ బూత్ కమిటీ, 39 వ వార్డ్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్, సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవార మహేష్, సౌత్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్, చింతూకాయల వాసు తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles