ఉర్రూతలూగించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ప్రత్యేక అతిథిగా మిల్క్ బ్యూటీ తమన్నా

by vvwnews.com

ఉర్రూతలూగించిన
బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్
-ప్రత్యేక అతిథిగా మిల్క్ బ్యూటీ తమన్నా

విశాఖపట్నం:-
ప్రముఖ డిజైనర్ అక్షత్ బన్సాల్, ప్రముఖ బాలీవుడ్ నటి నటి తమన్నా భాటియా, రిత్విజ్ లతో బ్లెండర్స్ ప్రైడ్ ఆధ్వర్యంలో
ఫ్యాషన్ టూర్ పేరుతో నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో నిర్వహించిన సంగీత కార్యక్రమం విశేషంగా అలరించింది. ‘ది వన్ అండ్ ఓన్లీ’ పేరుతో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ యువతను ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్
అక్షత్ బన్సాల్ రూపొందించిన విభిన్న ఫ్యాషన్ దుస్తులు ధరించిన మోడల్స్ రాంప్ వాక్ చేసి ఫ్యాషన్ షో లో ప్రదర్శించారు.
తమన్నా భాటియా ప్రత్యేక ఆకర్షణగా ర్యాంపు వాక్ తో
ఆహుతులను ఆకట్టుకున్నారు. రిత్విజ్ అండ్ టీం అందించిన మ్యూజిక్ కి యువత డ్యాన్సులు చేస్తూ
మైమరిచిపోయారు.

*–మిల్క్ బ్యూటీ మెరుపులు–* కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్, ఉర్రూతలూగించేలా డీజే పాటలు.. ఒయ్యారాలు వలికిస్తూ అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్తో ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. రాడిసన్ బ్లూ రిసార్ట్లో నిర్వహించిన బ్లెం డర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కార్యక్రమం వీక్షకులను కనువిందు చేసింది. సినీ తార తమన్నా భాటియా ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నల్లటి మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ పై మిల్క్ బ్యూటీ వాక్ చేయడంతో సందర్శకులు ఫిదా అయిపోయారు. ఇతర మోడల్స్ కూడా ఆధు నిక దుస్తుల్లో ర్యాంప్ పై సందడి చేశారు. ఈ ఫ్యాషన్ షోను చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.

*వైజాగ్ అంటే చాలా ఇష్టం* : –
వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని సినీ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు. ఫ్యాషన్ షో అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని, కానీ ఇటువంటి ఫ్యాషన్ షోలో వాక్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. ర్యాంప్పై వాక్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులందరూ హార్ట్ సింబల్ చూపిస్తుంటే.. ఆనందంతో నా హార్ట్ బీట్ పెరిగిందన్నారు. సినిమాలపై స్పందిస్తూ.. ఈ మధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందన్నారు. తను నటిం చిన ఆవారా సినిమా రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో హ్యాపీడేస్ సినిమాను కూడా రీ రిలీజ్ చేసే అవకాశ ముందన్నారు. ఈ సినిమా ఈ మధ్యే చేసినట్లు అనిపిస్తోందన్నారు. హర్రర్ జోనర్ లో మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి సిద్ధం ఉన్నట్లు చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles