‘మురికి నీరే నగర ప్రజలకు తాగునీరా’
-గోవిందరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి
#CPIMAP #cpimnews #WorkersUnity
నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని, ప్రజల ఆరోగ్యం పరిరక్షించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద క్లాప్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేసి నగరం యొక్క మురికి నీరును శుద్ధి చేసి పైపులైన్ ద్వారా సముద్రానికి పంపించడానికి ఎందుకు నిధులు కేటాయించడం లేదని కేంద్రమంత్రి కింజరాపు. రామ్మోహన్ నాయుడుని వారు ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి మంత్రిగా ఉన్న మీరు నగరవాసులకి ప్రకృతి సిద్ధంగా వచ్చిన మంచినీరు కూడా అందజేయలేరా అని అన్నారు. ఇదేనా మీరు ప్రజలకు చేస్తున్న అభివృద్ధి అని ప్రశ్నించారు. నాగావళి నది కాలుష్యంతో నది జలాలు ఎందుకు విధ్వంసానికి కోరుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నగరంలో మురికి నీరు నదిలో 11 చోట్ల కలుస్తుందని అదేవిధంగా హాస్పిటల్ వ్యర్ధాలు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలు, నదిలో కలిసి నీరు విషతుల్యం అవడంతో ఆ నీరు తాగి ప్రజలు నిరంతరము అనారోగ్యం పాలు అవుతున్నారని ఇటీవల కాలంలోనే ప్రబలిన డయేరియా ఒక మచ్చు తునకని అన్నారు. ప్రజలకు వస్తున్న అనారోగ్యం ప్రభుత్వం కల్పిస్తున్న రోగాలుగా అభివర్ణించారు. ప్రజల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. పాలకులు ప్రజలకు మంచినీరు అంది ంచ డం లేదని అన్నారు. మరొకవైపున నగరంలో రకరకాల టాక్స్లు వేసి ప్రజల్ని తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఎప్పటిలోగా ఏర్పాటు చేసి ఎస్ టి పి ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన జలాలను పైపులైన్ ద్వారా సముద్రంకి ఎప్పటిలోగా పంపి స్తారో కేంద్ర మంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగావళి నది మంచినీటిని మురికి నీటిగా మార్చే ఘనత మన పాలకలు దేనని ఎద్దేవా చేశారు. నాగావళి నది జల కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ మే 21వ తేదీన వామపక్షాలు,ప్రజాసంఘాలు,స్వచ్ఛందసంఘాలు తో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి దశలు వారి ఉద్యమాన్ని ప్రజల మద్దతుతో ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పోలాకి. ప్రసాదరావు, యం.గోవర్ధనరావు, కొత్తకోట అప్పారావు, ఎం. ఆదినారాయణమూర్తి, అల్లు. సత్యనారాయణ, బి. చిన్నారావు, ప్రవీణ, సూరీడమ్మ, వెంకటరావు
మురికి నీరే నగర ప్రజలకు తాగునీరా’#vvwnews
0