సంక్రాంతికి వస్తున్నాం 50 రోజులు పూర్తి చేసుకొని 300 కోట్లు కలెక్షన్ సాధించిన సందర్భంగా సంబరాలు.

by vvwnews.com

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం

వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో సంబరాలు..

పాల్గొన్న జిల్లా, సిటీ వైడ్ వెంకటేష్ & రానా ఫాన్స్,
గౌరవ సలహాదారుడు గంట్ల శీను బాబు,

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం గా
50 రోజుల ప్రదర్శించి,300 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ రికార్డు సృష్టించిన సందర్బంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సంబరాలు వివరాలు వెల్లడించేందుకు జిల్లా, సిటీ వైడ్ వెంకటేష్ & రానా ఫాన్స్, విశాఖపట్నం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం డాబాగార్డెన్స్ వి జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులు శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ విజయ భాస్కర్, సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ వేణు బాబు, వెంకటేష్ బాబు, రానా బాబు ఫ్యాన్స్ గౌరవ సలహాదారుడు గంట్ల శీను బాబు, వెంకటేష్ బాబు మరియు రానా ఫ్యాన్స్ నిర్వాహకులు అర్జీ శంకరరావు, తదితరులు పాల్గొని ముందుగా కేక్ భారీ కేక ని కట్ చేసి అందరికీ వితరణ చేశారు ఈ సందర్భంగా 50 రోజులు సినిమా విజయోత్సవం పురస్కరించుకొని లీలామహల్ థియేటర్ సిబ్బందికి నిత్యవసర వస్తువులు పంపిణీ ముఖ్య అతిధుల చేతుల మీదుగా చేశారు. ఈ సందర్భంగా అతిధులు ముఖ్య అతిథులు కార్యక్రమాన్ని నిర్దేశించి మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం చిత్రము జనవరి నెలలో సంక్రాంతి పండుగ సమయంలో విడుదలైన తెలుగు సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారని,వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించరని, ఈ సినిమా టీజర్‌ను, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 14న థియేటర్‌లలో విడుదల చేశారని,సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరి, 17 రోజులలోనే రూ.303 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వాసులు చేసిందన్నారు.కార్యక్రములో
పిల్లి శంకర రావు, కృష్ణ ఏఎన్ఆర్, మోహన్ బాబు సంఘాల నాయకులు మన్యాల శ్రీను వాసు, గణేష్ దిబ్బ సంకర రావు, రాజు, తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles