15 ఏళ్ల తర్వాత పోర్టు కాజువల్ కార్మికుల కల సాకారం* #vvwnews

by vvwnews.com

*15 ఏళ్ల తర్వాత పోర్టు కాజువల్ కార్మికుల కల సాకారం*

*ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు కల్పించిన చైర్మన్ అంగముత్తు*

*ఆందరి సహకారంతోనే సాధ్యం*
*కార్మికులు హర్షాతి రేకాలు*

అక్కయ్య పాలెం.. జనవరి 6

. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు తమ జీవనోపాధి కోసం పోరాడిన విశాఖపట్నం పోర్ట్ కాజువల్ కార్మికులు కళ ఎట్టకేలకు సాకారం అయింది. ఈ మేరకు పోర్టు చైర్మన్ అంగముత్తు క్యాజువల్ కార్మికులకు పోర్ట్ లో ఉపాధి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం నరసింహనగర్ రైతు బజార్ వద్ద కార్మికులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆల్ ఇండియా పోర్టు అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు డి కె శర్మ పాల్గొని మాట్లాడుతూ 347 మంది కార్మికులు తమ తల్లి దండ్రులు ఉద్యోగాలు పొంది ఎన్నో ఏళ్లుగా డి ఎల్ బి, పోర్ట్ ట్రస్ట్ లో సేవలు అందిస్తున్నారని అయితే వారిని దినసరి కూలీలు గానే ఇంతవరకు పరిగినించేవారన్నారు.. తల్లిదండ్రులు ఉద్యోగాలు పొందిన పిల్లలకు ఇన్నేళ్లు తర్వాత చైర్మన్ అంగముత్తు కల్పించుకొని దినసరి నుంచి నెలసరి వేతనాలు చెల్లించడానికి అంగీకరించారని, అలాగే వారందరికీ ఇక మీదట పోర్ట్ లో నిరంతరం ఉపాధి కల్పించడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరిందని అయితే ఇది సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles