ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య డైవం భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు

by vvwnews.com

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య డైవం భక్తుల పాలిట కల్పవల్లి, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు విజయవంతంగా ముగిశాయిని ఆలయ కార్యనిర్వాహణధికారి శ్రీమతి కే. శోభారాణి చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ విభాగాలు, మీడియా సహాయ సహకారాలతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయిన్నారు. ఉత్సవాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్సవాలు సందర్బంగా అమ్మవారికి
5కోట్ల 32లక్షల 63 వేల 560 రూపాయలు ఆదాయం లభించిందిన్నారు. గత సంవత్సరము కన్నా  46 లక్షల16 వేల 636 రూపాయలు  ఆదాయం  పెరిగిందన్నారు.  మీడియా సమావేశం లో ఆలయ సహాయ కార్యనిర్వాహణధికారి కే. తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  సి. హెచ్. వి. రమణ, ఏ. ఈ కే. ఎస్. ఎన్. మూర్తి , కే. సూర్య రావు, ఏ. ఈ, కే తిరుపతి రావు, పర్యవేక్షకులు, ఎమ్. వి. రమణ, పద్మజా, తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles