45
🙏🙏🙏🙏శ్రీ స్వామి వారి సన్నిధిలో తేది.31.12.2024 నుండి తేది.17.01.2025 వరకు పగల్
పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవములు, కనుమ పండుగ సందర్భముగా ప్రతి రోజు
ఉదయం దేవాలయంలో శ్రీ స్వామి వారి తిరువీధి, విశేష ఉత్సవములు జరుగును. కావున పై తేదిలలో
నిత్యము జరుగు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును.
మరియు తేది.10.01.2025 నుండి తేది.20.01.2025 వరకు రాపత్తు సేవలు జరుగును. ఈ
సందర్భములో ప్రతి రోజు సాయంత్రం గం.5.00లకు తిరువీధి ఉత్సవములు జరుగును.ఈ
సందర్భముగా పై తేదిలలో రాత్రి గం.. 7.00ల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామి వారి దర్శనములు
లభించును. రాత్రి ఆరాధన సేవ టిక్కెట్లు రద్దు చేయబడును.