హీరో కంచర్ల ఉపేంద్ర బాబుకు ఆత్మీయ సత్కారం
విశాఖపట్నం :ఢిల్లీలోని ఆంధ్రభావన్ లో ఇటీవల తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఈవెంట్ లో ప్రముఖుల సమక్షంలో సేవా అవార్డు అందుకున్న సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబుకు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్ లు ఆత్మీయ సత్కారం చేశారు. ఢిల్లీలో సేవా అవార్డు అందుకున్న ఉపేంద్ర బాబు తిరిగి విశాఖ చేరుకున్నారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఎంపీవి లోని అయన నివాసంలో ఉపేంద్ర బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సినిమాల్లో నటించడంతో పాటు, సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలవడం హర్షణియమన్నారు.
సినిమాల్లో నటించడంతో పాటు, ఉపేంద్ర బాబు తండ్రి ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, సినిమా నిర్మాత, టిడిపి నాయకులు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ కంచర్ల అచ్యుతారవు అడుగు జాడల్లో నడుస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందననీయం అన్నారు. ఉపేంద్ర బాబు మాట్లాడుతూ తాను చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు రావడం ఆనందంగా ఉందని ఈ అవార్డు తన బాధ్యత ను మరింత పెంచిందన్నారు.
ఉత్తరాంధ్ర కళాకారులను ప్రోత్సహించేందుకు ఉపకార్ సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వై ఆర్ ఎస్ ఎస్ రవికుమార్, పలువురు పాత్రికేయులు,ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధులు, నాగు, సుధీర్, అరుణ తదితరులు పాల్గొన్నారు