డిసెంబరు 28, 29 సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు* #vvwnews

by vvwnews.com

*ప్రెస్‌ మీట్‌ నోట్‌*
*డిసెంబరు 28, 29 సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు*
*28న పెందుర్తిలో భారీ ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయండి*
*-సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పిలుపు*
ఈ నెల 28, 29న సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు సుజాత నగర్‌లో జరుగనున్నాయని, 28న ఉదయం 10 గంటలకు పెందుర్తి జూనియర్‌ కాలేజీ నుండి సుజాత నగర్‌ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభను ప్రజలు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం జగదాంబ దరి నండూరిప్రసాదరావు భవన్‌లో సిపిఎం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, సీనియర్‌ నాయకులు ఎస్‌.జ్యోతీశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావులు పాల్గొని మహాసభల గోడపత్రికను విడుదల చేసారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ గత మూడేళ్ళ కాలంలో నిర్వహించిన కార్మిక, ప్రజా పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షించుకొని రాబోయే మూడేళ్ళ కాలంలో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళిక విడుదల చేస్తుందన్నారు. గత వైసిపి ప్రభుత్వం ప్రజలపై వేసిన ఆస్థిపన్ను, చెత్తపన్ను, విద్యుత్‌ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమించిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకై ఉత్తరాంధ్ర బైక్‌యాత్ర, నిరాహారదీక్షలు, అనేక రూపాల్లో నిరసనలు చేపట్టి ప్రైవేట్‌కాకుండా అడ్డుకోగల్గామన్నారు. కుసులవాడ మైనింగ్‌, ముడసర్లోవ, దసపల్లా, ఎర్రమట్టిదిబ్బల భూ కుంభకోణాలపై నిఖరంగా ఉద్యమించిందన్నారు. సంఘటిత, అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై అనేక పోరాటం చేయడమే కాకుండా కార్మికవర్గం చేపట్టే పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతిచ్చిందన్నారు. విశాఖపట్నంలో కొండవాలు ప్రాంతాలు, మురికివాడ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం గొంతెంత్తిందన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పేదలకు ఇళ్ళు, ఇళ్ళ స్థళాలు ఇస్తామని చెప్పి మోసగించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ పేదలకు ఇళ్ళు, ఇళ్ళపట్టాలు ఇవ్వాలని ఉద్యమించిందన్నారు. ఈ మహాసభల్లో ఈ పోరాటాలను సమీక్ష చేపట్టి రాబోయే మూడేళ్ళకాలంలో టిడిపి కూటమి ప్రభుత్వం, కేంద్ర బిజెపి ప్రభుత్వం వేయబోయే విద్యుత్‌ ఛార్జీలు, స్మార్ట్‌మీటర్లుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు. విశాఖ సమగ్రాభివృద్ధి, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. జగనన్న ఇళ్లు, టిడ్కో వంటి ఇళ్ళకు పేదలకు ఇప్పటికే డిడిలు రూపంలో డబ్బులు చెల్లించినందున ఇళ్ళసాధనకై ప్రజా ఉద్యమానికి రూపకం చేస్తోందన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఇట్లు
ఎం.జగ్గునాయుడు
కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles