కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం#vvwnews

by vvwnews.com

 కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం

విశాఖపట్నం:-
కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, ఆంధ్రప్రదేశ్‌లో తమ మొదటి ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను విశాఖపట్నంలో గాజువాక టౌన్‌ లో ప్రారంభించింది. గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ గాజువాకలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. పట్టణ వాసులు దూర ప్రాంతం కి వెళ్లకుండా అన్ని రకాల వజ్ర ఆభరణాలు లభిస్తాయన్నారు.
హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు&మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా, పరాగ్ షా
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఇది తమకు మొదటి స్టోర్ అని చెప్పారు.
ఇది భారతదేశంలో కిస్నా కు 60వ ప్రత్యేక షోరూమ్‌ అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా
కిస్నా డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 100 శాతం వరకు తగ్గింపును అందిస్తోందని, బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 15 శాతం తగ్గింపును అందిస్తోందన్నారు. ప్రతి కొనుగోలు సందర్భంగా తాము ఒక మొక్క నాటుతామని చెప్పారు. కిస్నా యొక్క ‘ అబ్కి బార్ ఆప్కెలియే షాప్&విన్ ఏ కార్’ ( ఈ సారి మీకోసం కొనుగోలు చేయండి&కారును గెలుచుకోండి)  ప్రచారం వినియోగదారులకు 100కి పైగా కార్ల నుండి గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుందన్నారు.
‘హర్ ఘర్ కిస్నా’ పేరుతో
తాము ప్రతి ఇంటిలో భాగం కావడం తమ లక్ష్యం అన్నారు.
కిస్నా ఫ్రాంచైజ్ పార్టనర్ రాంబాబు కొత్తపల్లి అండ్ బ్రదర్స్ మాట్లాడుతూ తాము అసమానమైన డిజైన్‌లు మరియు నైపుణ్యాన్ని అందిస్తామన్నారు, ఆభరణాల రిటైల్ అనుభవంలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతాము..” అని అన్నారు. 
ఈ సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles