నగరంలో జర్నలిస్టులకు తన శక్తిమేర సహాయం అందిస్తానని ఏపి ఫిల్మ్ ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ , ఉపకార్ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపి స్మాల్ అండ్ మీడియమ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నట్లు గుర్తించానన్నారు. అయితే విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తన వంతుగా జర్నలిస్టులకు ఉచితంగానే హెల్మెట్ లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే కొంత మంది జర్నలిస్టులకు అందజేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా మరిన్ని హెల్మెట్ లు అందిస్తామన్నారు. అప్పటికి ఎవరికైనా హెల్మెట్ అందకపోతే తమ ఉపకార్ ట్రస్టు కార్యాలయంలో సంప్రదించి ఉచితంగా తీసుకోవచ్చునన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ అర్బన అద్యక్షులు పి.నారాయణ్ లు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న శివాజీపార్కులో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి తమ కార్యవర్గం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ నగర అధ్యక్ష, కార్యదర్శులు, ఇరోతి ఈశ్వరరావు, మధన్, త్రినాధ్ ఆయా కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు.
నగరంలో జర్నలిస్టులకు తన శక్తిమేర సహాయం అందిస్తాo..! #vvwnews #visakapatnam
50