హిందూ మతంలో ఉన్న హిందూ దళితులుకు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం మంచిది కాదుఅని శ్రీరఘురామకృష్ణంరాజు

by vvwnews.com

సమీకరించు!!ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం చింతాడ ఆనంద్ కేసులో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్.సి. స్టేటస్ రద్దు అవుతుందని తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ఎస్.టి, బి.సి, ఓ.సి కులాలకు చెందిన క్రైస్తవుల పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ తీర్పు మిగతా వర్గాల క్రైస్తవులకు వర్తించదా? స్వాతంత్రం వచ్చి నేటికి 77 సంవత్సరములు అయినప్పటికీ కుల వివక్ష, అంటరానితనం, గ్రామాలలో రెండు గ్లాసుల పద్దతి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాగే దేవాలయాలలో నేటికీ దళితులకు ప్రవేశాన్ని నిరాకరిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాలలో నేటికి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. గత 7 సంవత్సరాలుగా ఎస్.సి కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఋణం మంజూరు చేయలేదు. ఒక్క దళిత సామాజిక వర్గాలకు తప్ప అన్ని వర్గాలకు అందిస్తున్నారు. చివరికి పాస్టర్స్ పుజారులకు, మరియు ఇమామ్లకు గౌరవ వేతనం ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గౌరవ డిప్యూటి స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు దళితులు, దళిత క్రైస్తవల గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో దళితులు అందరూ క్రైస్తవులని సంబోధించి మాట్లాడుతున్నారు. హిందూ మతంలో ఉన్న హిందూ దళితులుకు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం మంచిది కాదు అని శ్రీ రఘురామ కృష్ణంరాజు గారిని ప్రశ్నిస్తున్నాము.

Use Social Media to Spread the Word about Our News

related articles