52
విశాఖ నగరంలో ఉన్న సింహాచలం దేవస్థానం కు చెందిన ప్రహ్లాద కళ్యాణమండపమును తక్షణమే సింహాచలం దేవస్ధానానికి అప్పగించాలని సింహాచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, విశాఖపట్నం అంతర్జాతీయ విమానశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు ఈ అంశంపై గంట్ల శ్రీను బాబు వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఈ నెల 12న సిఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లను అమరావతిలో కలసి ఈ సమస్యను తెలియజేసిన విషయం కలెక్టర్ కు తెలియచేసారు..