*ఈరోజు అసెంబ్లీ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలు అంశాలను శాసనసభలో ప్రస్తావించారు*
*విశాఖలో 22 ఎ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని*
*22a సమస్య పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు*
*అధికారుల నుంచి సరైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల పరిష్కారం లేక ప్రజలు అనేక ఇబ్బందులు*
*22 ఎ నుంచి విముక్తి కలిగించాలని సభ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే*
*జగదాంబ జంక్షన్, మహారాణిపేట ,వెంకటేశ్వర మెట్ట , రంగరీజు వీధి వంటి ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాల్లో 22 ఏ సమస్య వల్ల ప్రజలకు ఇబ్బందులు*
*100 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలు ఇప్పటకీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు*
*మంత్రి గారు ప్రత్యేక దృష్టిసారించాలని వినతి*
*గత ప్రభుత్వా కక్షపూరిత చర్యలు వలన అనేక మందికి ఇబ్బందులు*
అనంతరం మాట్లాడుతూ…
వృద్ధులకు లబ్ధి చేకూరే పెన్షన్ పథకంపై మాట్లాడుతూ
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 70 రూపాయల పథకం ఈరోజు గౌరవ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు సమూలంగా మార్పులు తీసుకొచ్చి, వృద్దులు కు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో
అర్హులైనప్పటికి ఉద్దేశ పూర్వకంగా కొంతమంది పెన్సన్స్ తొలగించారని, వాటిని పునరుద్ధరించాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి వున్న కుటుంబంలో 12,000 శాలరీ ఉన్న సందర్భాలలో కూడా పెన్సన్ తీసేవేయడం పట్ల కలిగే ఇబ్బందులను తెలిపారు. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని, కొత్త పెన్షన్లు కూడా అందజేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కోరారు .