ష‌ర్మిల‌ది దురాశ. పెంచిన బాబాయ్‌, తోడ‌బుట్టిన అన్న మీద దుర్భాష‌లు.ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిజాలు

by vvwnews.com

దాడి
పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మాజీ మంత్రి గుడివాడ్ అమర్నాద్ ధ్వజం.
విశాఖ‌ప‌ట్నంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో మీడియాతో జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌.

విశాఖ‌లోని మండలి విపక్ష నేత బొత్స చేసిన విష‌యాన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగానే ష‌ర్మిల చెప్ప‌లేద‌ని, న‌లుగురు మ‌న‌వ‌ళ్లు మ‌న‌వరాళ్ల‌కు ఆస్తి సమానంగా పంచాల‌ని చెప్పారన్న విషయాన్ని సాక్షులుగా ఉన్న‌వారు కూడా ఒప్పుకోవ‌డం లేద‌ని అమర్‌ తెలిపారు. పార్టీ కోసం ఇంత క‌ష్ట‌ప‌డిన నాకు అన్న ఏమిచ్చాడ‌ని ప్ర‌శ్నించిన ష‌ర్మిల‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రూ. 200 కోట్ల‌కుపైగా ఆస్తుల‌ను రాసిచ్చి, స్వార్జిత‌మైన ఆస్తుల్లోనూ 40 శాతం వాటా ఇచ్చినా ఆశ తీర‌లేద‌ని ఆరోపించారు. 2019 ఆగ‌స్టులో ఎంవోయూ జ‌రిగిన‌ప్పుడే ఆస్తుల బ‌ద‌లాయించుకుంటే రూ. 200 కోట్ల వ‌ర‌కు ట్యాక్స్ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గిన ష‌ర్మిల‌.., ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు బ‌ద‌లాయిస్తే అన్న‌కు న్యాయ‌ప‌రంగా చిక్కులు ఎదుర‌వుతాయ‌ని తెలిసినా ఎందుకు కుట్ర‌పూరితంగా షేర్లు బ‌ద‌లాయించుకున్నారని నిలదీశారు. అంటే
చంద్ర‌బాబు నాయుడు అండ‌తో జైలుకు పంపాల‌ని చూశారా అని ష‌ర్మిల‌ని గుడివాడ సూటిగా ప్ర‌శ్నించారు. సరస్వతీ షేర్లపైన హైకోర్టు స్టే ఇచ్చిన విషయంలో అబ‌ద్ధాలు చెప్ప‌డాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలను గుర్తుచేశారు.

,

Use Social Media to Spread the Word about Our News

related articles