“స్వచ్చతా హి సేవ 2024” పై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు#vvwnews

by vvwnews.com

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అలవరుచుకోవాలి అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ముకుంద రావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మాదవధార లోని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో “స్వచ్చతా హి సేవ 2024” పై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ వలె తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫిస్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కర్భన ఉద్గారాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి అని కోరారు. విద్యార్థులు పర్యావరణ హితంగా జీవించాలని, కాలుష్యం నివారణకు అవసరమైన అవగాహన కల్పించేందుకు కృషి చెయ్యాలి అన్నారు. ప్రతీ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి నిరంతరం చెయ్యాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫిస్ మేనేజర్ బి శ్రీనివాస్ రావు, రీజనల్ ఆఫీస్ ఎఇ శ్రీ లక్ష్మీ,
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, కోఆర్డినేటర్లు జె రవితేజ, ఐ కృష్ణ కుమారి, జె రాజేశ్వరి, వ్యూస్ సంస్థ కో ఆర్డినేటర్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles