Yupkar & SSLS Creatiions “MEDIA AWARDS- 2024” || Dr.Kancharla Atchutha Rao || Vizag #vvwnews

by vvwnews.com

ఉపకార్ చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా అవార్డ్స్ – 2024 ఘనంగా జరిగింది. అవార్డులు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డాబాగార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం కన్నుల పండుగ సాగిన కార్యక్రమంలో 65 మంది జర్నలిస్టులను కంచర్ల అచ్యుతరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అచ్యుతరావు మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టులు అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం అన్నారు సమాజంలో మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. అటువంటి మీడియాకు ఉపకార్ ఛారిటుబుల్ ట్రస్టు ద్వారా 10లక్షలు సంక్షేమ నిధికి కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ జర్నలిస్టుకి ఆరోగ్య పరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ ట్రస్టు ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటుందన్నారు. తమ ట్రస్టు ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండానే తమ సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నవారిని జర్నలిస్టులను, వీడియో జర్నలిస్టులను సత్కరించడం అభినందనీయం అని వారికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది మరింత
ప్రతిష్టత్మాకంగా రాష్ట్ర వ్యాప్తంగా వున్న జర్నలిస్టులకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి “మీడియా అవార్డ్స్ ను అందించ నున్నట్టు ప్రకటించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles