ఉల్లాసంగా వాక్ ద చేంజ్ ఆడిషన్స్
సేంద్రీయ పత్తి, ప్రకృతి సిద్దమైన రంగులను ఉపయోగించి వస్త్రాలను వాడుకలోకి తెచ్చామన్నారు నీత్ డిజైనర్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మి కొండాల. ఈరోజు ఉషోదయ జంక్షన్ బ్రాడ్ వే డాన్స్ అకాడమీలో ఆడిషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్యూరీ మెంబర్స్ గా మోడల్, యాక్టర్ సంతోష్ నిమ్మని, మిస్ వైజాగ్ & మోడల్ పూజిత దేవులపల్లి వ్యవహరించారు. ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన పిల్లలు ఫైనల్స్ కు వెళ్తారని తెలియజేశారు. పసిపిల్లల లేలేత చర్మ ఆరోగ్యం కోసం అర్ఘానిక్ దుస్తులు దోహద పడతాయన్నారు.నవంబరు 10 వ తేదీన సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో కిడ్స్ ఫేషన్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంభందించి ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. పాఠశాల విధ్యార్థులకు, ఫేషన్ డిజైనర్లకు ఆర్ఘానిక్ దుస్తులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని తెలిపారు. పిల్లలని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సామ్స్ కిచెన్ ఇండియా, వీ హెల్త్ కేర్, డాన్స్ బ్రాడ్ వే అకాడమి, మన వైజాగ్, ఇలాహె మోడలింగ్ స్కూల్ సంస్థలు భాగస్వాములై సహకారం అందిస్తున్నాయని ఆమె తెలిపారు. ఆసక్తి కలిగినవారు 7995744495 నెంబరుకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.