ఉత్తరాంధ్ర ప్రధాన ఆయువు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని#vvwnews

by vvwnews.com

ఉత్తరాంధ్ర ప్రధాన ఆయువు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణమూర్తి స్పష్టం చేశారు. విశాఖ పౌర గ్రంధాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలతో కలిసి మాట్లాడారు.గాంధీ జయంతి రోజైన అక్టోబర్ రెండో తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి జీవిఎంసి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చెయ్యటానికి దూకుడు పెంచుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. అక్రమ హామీలతో కార్మికులను పక్కదారి పట్టిస్తూ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్దం అయిందని ఆరోపించారు. కార్మికుల కష్టంను అర్థం చేసుకొని ప్రజలు అంత ఈ ఉద్యమంలో ముందుకు రావాలని కోరారు. ప్రజాప్రతినిధులు మాటలు అన్నీ అవాస్తవాలు. పొంతన లేని మాటలతో కార్మికులకు ఇబ్బంది పెడుతున్నారన్నారు
కేంద్ర ప్రభుత్వంకు పన్నులు చెల్లింపులతో ముందు ఉండే పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ అని స్పష్టం చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles