డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు వి.బి.వి రెడ్డి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు కలసి ఘనంగా నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు వి.బి.వి రెడ్డి కళాశాల అభివృద్ధికి చేసిన కృషిని, అందించిన సేవలను ప్రశంసించారు. ఆయన గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందటమే కాక సేవా తత్పరత కలిగిన సేవాపరాయణులు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ద్వారా ఆర్ధిక సహాయం అందించారన్నారు . ఎన్నో విద్యా సంస్థలకు వ్యవస్థాపకులుగా ఉన్నారని . ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాలు . కళాశాల ఆవరణలో జరపటం మనందరికీ గర్వకారణం అన్నారు. ఈనాడు కళాశాల విద్యారంగంలో సముచిత స్థానంలో నిలిచింది అంటే వి.బి.వి రెడ్డి ఆనాడు చూపిన మార్గదర్శకత్వమే కారణమని యాజమాన్య వర్గం ఈ సందర్భంగా ఆయన పట్ల తమ గౌరవాన్ని ప్రకటించారు. ఆయన శత జయంతి వేడుకలను నిర్వహించటం తమకు గర్వకారణం అన్నారు.
డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు వి.బి.వి రెడ్డి శత జయంతి వేడుకలు #vvwnews
48