జెనీవాలో నిర్వహించిన ప్రపంచ క్యాన్సర్ సదస్సులో ప్రపంచ కాన్సర్ దినోత్సవ ప్రచారం- 2024 పురస్కారాల ఎంపికలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC), వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ 24 జెనీవా వారిచే టాప్ 3 లో గుర్తింపు పొందినందుకు మాకు సంతోషంగాను మరియు గర్వంగాను ఉందని మహాత్మాగాంధీ. క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ. “మా సమిష్టి కృషి వల్ల ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స పొందే ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు ముందుకు వేసేలా తీసుకువెళ్ళారు అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా & చత్తీస్గడ్ రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీ పరికరాలను సమకూర్చుకున్న ప్రప్రధమ హాస్పిటల్ గా, 400 పైగా క్లిష్టమైన క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు మరియు 200 పైగా బోన్ మారో ట్రాన్స్సాంట్ చికిత్సలను పూర్తీ చేసినట్లు తెలియచేయుటకు మేము
సంతోపిస్తున్నాము అని తెలిపారు.