భూదాన్ భూముల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నడుం #vvwnews #latestnews

by vvwnews.com

భూదాన్ భూముల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నడుం కట్టిందని ఏపీ సర్వోదయ మండల్ చైర్మన్ నీలం రాంబాబు నాయుడు స్పష్టం చేశారు.విశాఖ విజేఎఫ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్ధిక అసమానతలను రూపు మాపడంలో భాగంగా, భూమి లేని నిరుపేదలకు భూమిని, నివాసాలు లేని నిర్వాసితులకు నివాస ఆవాసాలను అందించాలన్న మహా సంకల్పంతో ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉధ్యమానికి కొంత మంది తూట్లు పొడుస్తున్నారని అందుకు నిదర్శనం.
విశాపట్టణం జిల్లాలోని ఆనందపురం మండలం పరదేసిపాలెం సర్వే నెం. 132లోని 50.56 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూదాన్ భూమిని ఆక్రమించుకోవడానికి కొంత మంది దళారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారన్నారు. కొంత మంది రాజకీయ నాయకుల అండతో బడా బాబులు నకిలీ పత్రాలను సృష్టించి, ఈ భూమిని తమ సొంత భూమిగా మార్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా, మరి కొంత మంది దళారులు “ఆంధ్ర ప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు” పేరుతో నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేసి, వాటి ద్వారా ఇళ్ళ స్థలాలుగా అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూదాన్ యజ్ఞ బోర్డు నియామకం జరుగలేదని, అయినప్పటికీ పాత తేదీలతో నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేసి దందా కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సర్వోదయ మండల్ చైర్మన్ ఆర్.శంకర్ నాయక్, ఏపీ సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి దీనబంధు, ఏపీ సర్వోదయ మండల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles