విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కెేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయి
‘‘ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీల మాదిరిగా విశాఖ స్టీల్‌కు లాభాలు ఎందుకు రావడంలేదు’’ అని ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును citu రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్. నర్సింగ్ రావు ప్రశ్నించారు. సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆడలేక మద్దెల ఓడు’’ అన్నట్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించలేక విశాఖస్టీలు పై అభండాలు వేయడం ఆపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ 120 % ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించిన చరిత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వం గత 30 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా సొంత లాభాలతో సాలీన 32 లక్షల టన్నుల సామర్ధ్యం నుంచి 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచింది. హుద్‌హుద్ నష్టాలు వెయ్యి కోట్లను కేంద్రం ఒక్క రూపాయి కూడా భరించలేదు. కోవిడ్ కాలంలో కూడా విశాఖ స్టీల్ లాభాల్లోనే ఉంది. రాజకీయ కారణాలతో రాయబెరిల్లీ లో రైల్‌వీల్ ప్లాంట్ కోసం 2 వేల కోట్లు అనవసరంగా ఖర్చుపెట్టించారు. ఒడిస్సా మైనింగ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఇనుపగనుల కొనుగోలు కోసం ఒక్క టన్ను కూడా రాకపోయినా వెయ్యికోట్లు వృధాగా ఖర్చుపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులు, డివిడెండ్ల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 58 వేల కోట్లు చెల్లించారు. ఏ ప్రైవేటు కంపెనీ అయినా ఇంత పన్నులు చెల్లించిందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు రూ.4890 కోట్లు మాత్రమే. ప్రభుత్వ రంగం అయినందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సుమారు 5 వేల మంది ఎస్.సి, ఎస్.టి అధికారులు, కార్మికులు ఉద్యోగాల్లో చేరారని ప్రభుత్వం పై ప్రశ్నలవర్షం కురిపించారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కెేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయి #vvwnews
48