పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతినే పూజించాలని మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు దువ్వాడ లక్ష్మి భార్గవి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంపత్ వినాయకుని గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు వినాయక ప్రతిమలలో ప్లాస్టో పారిస్, ధర్మోకోల్ వాడటం వలన అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలగడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయున్నారు , వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణ హానికి కారణమవుతున్నాయన్నారుప్రకృతిని గౌరవించకపోవడం వలన మనం అనేక విపత్తులు చూస్తున్నామని, పేర్కొన్నారు కాలుష్యంలో మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూజించాలని విజ్ఞప్తి చేశారు. మన బావి తరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతినే పూజించాలి #vvwnews #news
48