సమాజానికి రెండు కళ్ళు చెవులు మాదిరిగా నిరంతరం శ్రమించే జర్నలిస్టులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వాసవియన్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్
వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి 201 ఏ రీజియన్ టూ జోన్ వన్ శాఖ ఆధ్వర్యంలో వాసవి వీక్ కార్యక్రమంలో
భాగంగా శుక్రవారం రామా టాకీస్ రోడ్డు శ్రీనగర్ ఎస్ ఎం గెస్ట్ హౌస్ వద్ద జర్నలిస్ట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు సీనియర్ రిపోర్టర్లు ఫోటో వీడియో గ్రాఫర్లను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ముందుగా పాత్రికేయ మిత్రులకు జర్నలిస్టు డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్స్ సమాజాభివృద్ధి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
సమాజానికి రెండు కళ్ళు చెవులు మాదిరిగా నిరంతరం శ్రమించే #vvwnews
53