డాబాగార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ బద్ధమేనా? అంశం పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సు కు తెలంగాణ విశ్వ విద్యాలయాలు ఫాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్, దక్షిణ భారత సిద్ధాంత కర్త, గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధ వనం చేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదు అన్నదే రాజకీయా పార్టీలు ఆలోచన అని మండిపడ్డారు. బిఎస్పీ పార్టీ తప్ప ఎవరు వ్యతిరేకించలేదన్నారు. వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అని అభిప్రాయపడ్డారు. కులాల మధ్య వ్యత్యాసం లేదని ఇద్దరూ ముఖ్యమంత్రులు సమావేశంమై 371 డి ప్రకారం జోన్ డి లో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు. సుప్రీమ్ కోర్టు ఇచ్చింది తీర్పు కాదని కుట్ర అని అది బిజెపి, అరెస్సస్ కుట్ర అని పేర్కొన్నారు. మాల, మాదిగ లు కలిసి వుండాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. 30 ఏళ్ల నుంచి సమస్య రగులుతుంది. సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పులో లోటు పాట్లు వున్నాయిన్నారు. కార్యక్రమంలో రాజేంద్ర, రేణు కుమార్, వేణు గోపాల్, అన్నవరం తదితరులు పాల్గొన్నారు
ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ బద్ధమేనా? అంశం పై రాష్ట్ర స్థాయి సదస్సు #vvwnews
50