శతశాతం ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి
– ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
– మన ఓటే మన భవిష్యత్తు అని మరిచి పోవద్దు
– నిమ్మకాయల భాస్కర్, వ్యవస్థాపక అధ్యక్షులు, పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ
ఓటర్లు అందరూ శతశాతం ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి అని పీపుల్స్ పవర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నిమ్మకాయల భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఎం విపి కాలనీ, గాయిత్రి విద్యా పరిషత్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాల్లో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని ప్యీపుల్స్ పవర్, ఎ ఎస్ కె ఫౌండేషన్, గ్రీన్ క్లైమేట్ టీం తదితర ఎన్ జి ఒ లు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును పొందాలి, ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఐదేళ్లపాటు మనల్ని సజావుగా పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు.
ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ భారత రాజ్యాంగం పేద, ధనిక, కులం, మతం, వర్ణం అనే బేధం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందన్నారు. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . మేధావులు విద్యార్థులు కర్షకులు కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు అమ్మలు అక్కలు అన్నలు వృద్ధులు యువకులు అనే తారతమ్యం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ ఆశించే మార్పు రావాలంటే శాసించే మీ ఓటు వేయాలని కోరారు. మనకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే “నోటా” బటన్ నొక్కి పైన ఉన్న వారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్క్ ఫౌండేషన్ ప్రతినిధి మునీర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
18 సంవత్సరాల వచ్చిన ప్రతి ఒక్కరు 100% ఓటును వినియోగించుకోవాలి అమ్ముకోకూడదు మర్చిపోవద్దు
63