విచారణాధికారిగా రిటైర్డు జడ్జి సమ్మతం కాదు..* #vvwnews

by vvwnews.com

*విచారణాధికారిగా రిటైర్డు జడ్జి సమ్మతం కాదు..*
*సిటింగ్ న్యాయ మూర్తిని నియమించండి ..*
*విదసం డిమాండ్*
ఆంధ్రా యూనివర్సిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ లో అవకతవకల పై విచారణ కు రిటైర్డు జడ్జి నియామకం సమ్మతం కాదు సిటింగ్ న్యాయ మూర్తిచే విచారణ జరపాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. .
ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసారు.. పి జి ఆర్ ఎస్ లో పిర్యాదు చేసిన అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో వెంకట రావు మాట్లాడుతూ గత ఏడాది నవంబరు లో ఆంధ్రా యూనివర్సిటీ లో 28 ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ లో అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని దీనిపై సిటింగ్ న్యాయ మూర్తిచే విచారణ చేపట్టాలని నవంబర్ 17 న విదసం కలెక్టరు కు పిర్యాదు చేసిందని గుర్తు చేశారు. ఆ పిర్యాదు పై 6 నెలల కాలయాపన అనంతరం రిటైర్డు న్యాయ మూర్తి చే జరిగే విచారణకు హాజరై సాక్షాలు చూపాలని విదసం కు నోటీసు ఇచ్చారన్నారు . యూనివర్సిటీ లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులుగా రిజస్టార్, వీసీ లు అని పత్రికలు, ప్రసంగాలు ఘోషిస్తుంటే వారే సొంతంగా నచ్చిన వారిని ఏరికోరి ఓ విశ్రాంత న్యాయం మూర్తిని విచారణ కోసం నియమించుకోవడం విడ్డూరంగా ఉందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని వెంకట రావు ఆక్షేపించారు .. ఏ యు ఉద్యోగ నియామకాల్లో నిజాలు నిగ్గు తేలాలంటే సిటింగ్ న్యాయ మూర్తిచే విచారణ చేపట్టాలని, బహిరంగ విచారణ ద్వారా బాదితులు కూడా పిర్యాదు చేసే అవకాశం కల్పించాలని వెంకట రావు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సోడదాసి సుధాకర్, జాజి ఓంకార్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కర రావు, గుడాల ఈశ్వర రావు , సబ్బవరపూ శ్రీనివాస్,గురు దేవి , నడుపూరు రమణ తదితరులు పాల్గొన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles