అందరూ ఓటెయ్యాలి – ఎవరూ ఓటు అమ్ముకోరాదు
– ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి
– మన ఓటే మన భవిష్యత్తు
– నిమ్మకాయలు భాస్కర్ , సెక్రటరీ, పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ
అందరూ ఓటెయ్యాలి – ఎవరూ ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ సెక్రటరీ నిమ్మకాయలు భాస్కర్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నం బీచ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి, గాజువాక, భీమిలిలో , మురళీ నగర్, మాధవధార , సీతమ్మధార, ఆరిలోవ, హనుమంతవాక, ఎంవిపి కాలనీ లలో భారత ఎన్నికల సంఘం తరఫున స్వీప్ కార్యక్రమాన్ని , గ్రీన్ క్లైమేట్ టీం, జెసిఐ తదితర ఎన్ జి ఒ లతో కలిసి నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే అంశం మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కును పొందాలి, ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరారు. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఐదేళ్లపాటు మనల్ని సజావుగా పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత మనపై ఉందన్నారు . అందుకే మనమంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ
భారత రాజ్యాంగం పేద, ధనిక, కులం, మతం, వర్ణం అనే బేధం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందన్నారు. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . మేధావులు విద్యార్థులు కర్షకులు కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు అమ్మలు అక్కలు అన్నలు వృద్ధులు యువకులు అనే తారతమ్యం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు .
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ ప్రజలు తాము ఆశించే మార్పు రావాలంటే, ప్రజల పక్షాన అభివృద్ధి జరగాలంటే శాసించే మీ ఓటు వేయాలని కోరారు. మనకు ఇష్టమైన నాయకులు పోటీలో లేకుంటే “నోటా” బటన్ నొక్కి పైన ఉన్న వారెవరూ కాదు అని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు నర్సింగ్, తేజ, తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అవేర్నెస్ ప్రోగ్రాం ఆర్కే బీచ్ లో నిర్వహించారు.
61