శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం
సింహాచలం తేదీ 30 మార్చి 24
4 వ రోజు దిగ్విజయంగా స్వామి వారి సుదర్శన నరసింహ మహా యజ్ఞం
ఇఓ . ఎస్. శ్రీనివాసు మూర్తి
అంగరంగ వైభోగం శ్రీ సుదర్శన
నారసింహ మహా యజ్ఞం*
వేదమంత్రాలతో పులకించిన సింహగిరి
పరవశించిన భక్తకోటి.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహోలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో 4 వ రోజు శ్రీ సుదర్శన నారసింహ మహా యజ్ఞం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరక స్వామివారి సుదర్శన నారసింహ మహా యజ్ఞమునకు వేలాది మంది భక్తులు యజ్ఞంలో పాల్గొని స్వామి ని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి,మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ ను వేద మంత్రాలతో మృధు మధుర మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. యజ్ఞంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ రావు దంపతులు పూర్ణహుతి లో పాల్గొన్నారు భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణ లో ఉన్న సింహాద్రినాధుడు ను దర్శించుకుని సేవించుకున్నారు. యజ్ఞం మహా పూర్ణాహుతిలో అడిషనల్ కమిషనర్ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ దంపతులు పాల్గొని పూజలు జరిపారు. ఆలయ ఈవో ఎస్ .శ్రీనివాస్ మూర్తి మహా యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనులు విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు దశమంతుల రామలక్ష్మి ఆశ కుమారి, దినేష్ రాజు,సంపంగి శ్రీనివాస్ రావు తో పాటు అర్చక పరివారం, వేద పండితులు అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించి కున్నారు.