*పోర్టులో అఖిల భారత ద్రోహ నిరసన దినాన్ని పాటించిన కార్మిక సంఘాలు*
విశాఖపట్నం:- మేజర్ పోర్ట్స్ మరియు డాక్ వర్కర్స్ ఫెడరేషన్ల నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం పోర్ట్ ఉద్యోగులు ఇండియన్ మేజర్ పోర్ట్స్ యాజమాన్యాల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ బుధవారం పోర్టు ఎ ఓ బి ముందు ద్రోహ దినాన్ని పాటించి నిరసన తెలిపారు.
విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ 2022 జనవరి నుండి అమలులోకి వచ్చే మేజర్ పోర్ట్స్లోని క్లాస్ – సి & డి ఉద్యోగుల వేతన సవరణ పరిష్కారాన్ని వెంటనే ముగించాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు నిమ్మకు నిరీతిన్నట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.ఇప్పటికి 27 నెలల వ్యవధిలో 8 దపాలు చర్చలు జరిగిన పురోగతి లేదని అన్నారు.క్లాస్ – సి & డి ఉద్యోగులకు వేతన పెంపును నిరాకరించడానికి ఇండియన్ పోర్ట్ మేనేజ్మెంట్ అశాస్త్రీయమైన మరియు నిరాధారమైన వాదనల నుండి వెనక్కి తగ్గాలని అన్నారు. క్లాస్-సి & డి పోర్ట్ ఉద్యోగులకు న్యాయమైన మరియు సహేతుకమైన వేతన పెంపును నిరాకరించడానికి మంత్రిత్వ శాఖ కార్మిక వ్యతిరేక మరియు అనైతిక ముందస్తు షరతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేజర్ పోర్ట్స్లోని క్లాస్ – సి & డి ఉద్యోగుల కష్టపడి సంపాదించిన మరియు స్థిరపడిన వేతన వ్యవస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన అన్ని ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో డి కె శర్మ (hms) పద్మనాభ రాజు (సీఐటీయూ), చందు(ఎన్ పి టి ఈ ), కనకరావు (జనతా పోర్టు), ఏఐటీయూసీ నుంచి ఆర్ రమనబాబు, పోతన్న, సత్తిరాజులు, కోటేశ్వరరావు, ప్రకాష్ ,జి చిన్నారావు ,ఎ సత్యానందరావు,పెన్షనర్ అసోసియేషన్ నేత పి ఎస్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.