66
పామ్ సండే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ముఖ్యమైన రోజు. నేడు విశాఖ లో పామ్ సండే సందర్భంగా ఈత మరియు తాటి మట్టలతో పూలు అలంకరించి భక్తి శ్రద్ధలు తో ర్యాలీ నిర్వహించారు. గుడ్ ఫ్రైడే మందు ఆదివారం ఈ ర్యాలీ ప్రతి ఏటా చేయడం జరుగుతుందని క్రైస్తవ సోదరులు తెలులిపారు. క్రైస్తవ సోదరులందరూ ర్యాలీగా పాటల పాడుతూ , జీసస్ గురించి వివరించడం జరిగింది. ప్రజలు తన ముందు తాటి , ఈత కొమ్మలను నేలపై విస్తరిస్తుండగా, యేసు గాడిదపై స్వారీ చేస్తూ ప్రవేశించాడు అని అందరికీ తెలియజేసే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీ అనంతరం చర్చికి వెళ్లి యేసుకు ప్రార్థనలు చేయడం జరుగుతుందని తెలిపారు.