ఢిల్లీలో పోరాడుతున్న రైతుల ఉద్యమానికి సంఘీభావంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ

by vvwnews.com

*ప్రెస్‌ నోట్‌*

*ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సిఐటియు మద్దతు*
*సోమనాధన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేయాలి.*
*-సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.నర్సింగరావు*

ఢిల్లీ రాంలీలామైదానంలో లక్షలాది మందితో రైతులు ధర్నా చేస్తున్నారు. రైతుల పోరాటానికి సిఐటియు మద్దతు ఉంటుదని, అలాగే సోమనాధన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేసేవరకు పోరాడుతామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.నర్సింగరావు తెలిపారు.
గురువారం జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఫీుభావ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నర్సింగరావు పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలు నరేంద్రమోడీ, కేంద్ర బిజెపి ప్రభుత్వం చేపడుతోందని ధ్వజమెత్తారు. రైతాంగం యొక్క హక్కులను బిజెపి కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసారు. సెంట్రల్‌ వేర్‌ హౌస్‌లన్నీ కూడా అంబానీ, అధానీలకు అప్పగించడంతో రాబోయే కాలంలో ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడనుందన్నారు. 2021లో ఢిల్లీలో రైతుల చేపట్టే ఉధ్యమం తరువాత 2022లో యుపికి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బిజెపి లబ్ధిపొందడం కోసం ఆనాడు తెచ్చిన నల్లచట్టాలను వెనుక్కుతీసుకుంటున్నామని, సోమనాధన్‌ సిఫార్సులను అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయకపోవడంతో పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌ ఇతర రాష్ట్రాల రైతులు 2024 జనవరి నుండి మళ్ళీ ఢిల్లీలో ఉద్యమాన్ని ప్రారంభించారు. హర్యానా సరిహద్దులో సుభకరణ్‌సింగ్‌ అనే 25 సం॥ల యువ రైతును కాల్చి పొట్టనపెట్టుకుంది. నేడు ఢిల్లీలోకి రైతులను, ట్రాక్టర్లను రానివ్వకుండా రోడ్లపై సిమ్మింట్‌ గోడలు నిర్మించడం, మేకులు దిగ్గొట్టడం, భారికేడ్లు, ముల్లకంచెలు పెట్టి రైతులపై నిర్భంధం ప్రయోగించడం దుర్మార్గం. రైతులు ప్రక్కదేశం నుండి వచ్చే ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. గత ఏడాదికిపైగా ఢిల్లీలో పోరాడిన రైతు ఉద్యమంలో సుమారు 750 మంది రైతులను కేంద్ర బిజెపి ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది. డ్రోన్లును విత్తనాలు, మందులు జల్లడానికి ఉపయోగించాలి. కానీ కేంద్ర బిజెపి ప్రభుత్వం డ్రోన్లు ద్వారా విషపదార్ధాలను వెదజల్లుతుందని విమర్శించారు. దాని వలన రైతుల కళ్లు, ఒళ్లు మంటలు పుట్టించేలా వ్యవహరించింది.
నేడు దేశంలో ఆహారభద్రతకు పెనుప్రమాదమేర్పడిరది. ప్రపంచంలో ఆకలిసూచికలో 111 స్థానంలో ఉన్నాం. రేషన్ షాపులు ద్వారా గతంలో 16 రకాల నిత్యవసర సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు కేవలం 5 కేజీల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుందన్నారు. ప్రక్కనున్న శ్రీలంక, పాకిస్తాన్‌ కంటే మనదేశం వెనుకబడిపోయింది. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో 35శాతం పంటలు పండిరచుకోలేకపోయాం. ఎందుచేతనంటే పంటపండిస్తే రైతుకు నష్టం వస్తున్నది. తమ శ్రమ పోవడమే కాకుండా అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది. భారతదేశం వ్యవసాయక దేశం. 65శాతం రైతులు దీనిపై ఆధారపడుతున్నారు. వీరి పండించే పంటకు గ్యారంటీ చట్టంతీసుకురావాలి. విద్యుత్‌ మీటర్లును తొలగించి ఉచిత విద్యుత్‌ రోజుకు 9 గంటలు అందించాలని, రైతులు డిమాండ్లను తక్షణమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిష్కారం చేయాలని, స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం ఆపాలని, రైతులకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేసారు. లేని పక్షంలో కార్మిక`కర్షక మైత్రితో 2024 ఎన్నికల్లో బిజెపిని బంగాళాఖాతంలో కలిపే విధంగా విస్తృత క్యాంపెయిన్‌ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, నాయకులు పి.మణి, ఎస్‌.జ్యోతీశ్వరరావు, బి.జగన్‌, ఎం.సుబ్బారావు, యు.రాజు, టి.నూకరాజు, జి.అప్పలరాజు, కె.చంద్రమౌళి, కె.కుమారి, పి.వెంకటరావు, ఎం.సూరీడు, జి.పోలేశ్వరరావు, నాయుడు, శ్రీను, అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌
ప్రధాన కార్యదర్శి,
సిఐటియు, విశాఖజిల్లా కమిటీ

Use Social Media to Spread the Word about Our News

related articles