వైఎస్ఆర్సిపి ఆవిర్భాదినోత్సవ సందర్భంగా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ర్యాలీ నిర్వహించారు

by vvwnews.com

*విశాఖ దక్షిణంలో వైసీపీ* *ఆవిర్భావ దినోత్సవం*

*బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

*సీఎం జగన్, ఎమ్మెల్యే వాసుపల్లి ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేసిన వైసీపీ శ్రేణులు*

వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
27వ వార్డు వైసిపి అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి హాజరై తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే వార్డులో మూడు చోట్ల జగనన్న, ఎమ్మెల్యే వాసుపల్లి ఫ్లెక్సీ లకు వార్డు నాయకులు క్షీరాభిషేకం చేసి జై జగన్ జై వాసుపల్లి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గెలిచేది వైసిపి పార్టీ మాత్రమేనని, ప్రజలను గతంలో మభ్యపెట్టి మోసం చేసిన టిడిపి జనసేన బిజెపి పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. పేదలంటే పరిధి చూడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సాయం ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు వైసిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ చేపట్టారు.
విశాఖపట్టణం సౌత్ నియోజకవర్గంలో వైసీపీ నియోజవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలోబైక్ ర్యాలీ నిర్వహించారు. పలు చోట్ల పోస్టర్లను ఆవిష్కరించారు. ముఖ్య కూడళ్లలో వైయస్ఆర్, సీఎం జగన్ పటాలకు పాలాభిషేకం చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles