పోలియో ఆదివారం మార్చి 3వ మూడో తేదీన 2024 విశాఖ పట్నం

by vvwnews.com

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, విశాఖపట్నం జిల్లా సార్వత్రిక పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం “నిండు జీవితానికి రెండు చుక్కలు”

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభత్వ ఆదేశాలు మేరకు విశాఖపట్నంజిల్లా లో సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమల తేదీ 03-03-2024న జిల్లా లో జరపబడుచున్నది.

మన దేశం లో ఆఖరి పోలియో కేస్ జనవరి 2011 లోను మన రాష్ట్రంలో జులై 2008 లోను మన జిల్లాలో జనవరి 2007 లోను నమోదు కాబడినవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మన భారత దేశాన్ని 03 మార్చ్ 2014 న పోలియో రహిత దేశం గా ప్రకటించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గలిగిన 2,08,163 మంది చిన్నారులు కు నోటి ద్వారా పోలియో చుక్కల టీకా వేయుటకు లక్ష్యం గా నిర్దేశించడం జరిగింది.

ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 1002 పోలియో కేంద్రాలను, 32 ట్రాన్సిట్ బృందాలను, 74 మొబైల్ బృందాలను ఏర్పాటు చెయ్యడం జరిగింది. 4,312 మంది వాక్సినేటర్లు, 92 మంది పర్యవేక్షక సిబ్బంది ని నియమించడం జరిగింది. జిల్లా లోని అన్ని RTC బస్ స్టాండ్ లలోను, రైల్వే స్టేషన్ లలోను ప్రయాణీకుల సౌకర్యార్థం పోలియో చుక్కలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది.

జిల్లా వ్యాప్తంగా 106 High Risk ప్రాంతాలు అనగా మురికివాడలు, సంచారం చేసేవారు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, మత్స్యకారుల నివాస ప్రాంతాలు, చేరుకోవడానికి కష్టసాధ్యమయిన ప్రయాణ సాధనాలు లభించని ప్రాంతాలు ను గుర్తించి వాటిని సూక్ష్మ ప్రణాళిక లో చేర్చి ఆ ప్రాంతాల్లోని అర్హులైన 767 మంది చిన్నారులు కు 74 మొబైల్ బృందాల ద్వారా పోలియో చుక్కలు వేయుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా 03 మార్చ్ 2024న నిర్దేశిత పోలియో కేంద్రాలు లోను, అదే విధముగా 04. 05 తేదీలలో జిల్లా అంతటా, మరియు 06వ తేదీన GVMC పరిధిలోను 2004 బృందాలు గా ఏర్పడి, 6,51,702 గృహాలను దర్శించి, ఏ కారణం చేతనయినా పోలియో బూత్ లలో వాక్సిస్ తీసుకొనని చిన్నారులు ను గుర్తించి వారికి పోలియో చుక్కలు వెయ్యడం జరుగుతుంది. మన జిల్లా కొరకు 2,65,820 డోసుల పోలియో టీకాలు అందుబాటులో వున్నాయి.

ఈ పోలియో చుక్కలు 03-03-2024 న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోను, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, అన్ని వార్డు & విలేజి సచివాలయాలలోను వెయ్యడం జరుగుతుంది. కావున అర్హులైన చిన్నారులు అందరకీ ఈ వాక్సిస్ అందేవిధం గా ఈ అవకాశాన్ని వినియోగించుకొనవాల్సినది గా చిన్నారుల తల్లిదండ్రులు ను కొరడమైంది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగం గా వేయుచున్న ఈ చుక్కలు అదనపు మోతాదు మాత్రమే. ఒకవేళ ఇప్పటికే గతంలో పోలియో చుక్కలు తీసుకొన్నప్పటకి మరల ఈ ఏల్స్ పోలియో రోజున కూడా ఖచితంగా పోలియో చుక్కలు ఇప్పించవలసినదిగా తల్లిదండ్రులు ను కోరడమైనది.

డా // పి. జగదీశ్వర రావు

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి

విశాఖపట్నం,

Use Social Media to Spread the Word about Our News

related articles