50 YEAR’S GOLDEN JUBILEE CELEBRATION OF GRAND GOLDEN JUBILEE CELEBRATION 3Rd March 2024

by vvwnews.com

లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు
విశాఖపట్నం 2 మార్చి 2024 : డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల 1973 లో కేవలం రెండు తరగతి గదులు మరియు 120 మందితో ఆరంభమైనది. ఈ ఏడాది స్వర్ణోత్సవాలను వైభవంగా జరుపు కుంటున్నాది. అయిదు దశాబ్దాల విద్యా చరిత్రను చాటినది. 10 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం, అత్యాధునిక మౌలిక సదుపాయాలూ మరియు ప్రయోగశాలలు , 450 మంది సిబ్బంది, 4500 మందికి పైగా విద్యార్థులు ఈరోజు స్వాగతం పలికారు. ఈరోజు జరిగిన స్వర్ణోత్సవాల సదస్సులో కళాశాల సాధించిన విజయాలను మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి , సిబ్బంది మరియు సంస్థ అయిదు దశాబ్దాల కాలంగా విద్యార్థులకు అందించిన ఉత్తమ విద్యా బోధనా గురించి కళాశాల కరస్పాండెంట్ & కార్యదర్శి డాక్టర్ జి.మధు కుమార్ గారు పత్రికా విలేఖరులతో పంచుకున్నారు.
ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపున్యతలతో మరియు పారిశ్రామిక నైపుణ్యతల శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కళాశాల కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు డా.మధు కుమారు తెలిపారు. ఈ పరిణామంలో భాగంగానే ఇటీవల టీవీఎస్ ట్రైనింగ్ & సర్వీసెసను ఎలక్ట్రికల్ వాహనాలు (EVలు) కొరకు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఇందులో ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం పాల్గొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
విద్యలతో పాటు కళాశాల నందు వివిధ క్రీడలను, NCC, NSS కార్యక్రమాలను ప్రోత్సహించటం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నట్లు, ఈ కళాశాల పూర్వ విద్యార్థులు రంజీ ట్రాఫి & జాతీయ క్రీడలలో పాల్గొన్నారని, ఆంధ్రప్రదేశ లో అతి పెద్ద NCC బృందాన్ని కళాశాల కలిగి ఉన్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ మధు కుమార్ గర్వంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం బుల్లయ్య కళాశాల ఆంధ్రా యునివర్సిటీ అనుబంధంగా , NAAC వారి ‘A” గ్రేడ్ అక్రిడేషన్ కలిగి స్వయం ప్రతిపత్తి కళాశాల హోదాలో ఉన్నాదని అన్నారు. నేటి పరిశ్రమలకు అవసరమైన విద్యా భోధన చేపట్టి వారికి కావలసిన నైపుణ్య శిక్షణను విద్యార్థులకు అందించుటలో కళాశాల నిమగ్నమైనట్లు తెలిపారు.
డా.బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకల 3 మార్చి నిర్వహించు గ్రాండ్ ఫినాలేతో ముగుస్తాయి అన్నారు. ఈ గ్రాండ్ ఫినాలే నందు కళాశాల వ్యస్థాపక అధ్యక్షులు శ్రీ కె,జయ భారత్ రెడ్డి, ముఖ్య అతిధిగా డా.BVR.మోహన్ రెడ్డి, గౌరవ అతిధులుగా ప్రో. PVGD.ప్రసాద్ రెడ్డి, వైస్ చాన్సలర్, ఆంధ్రా యూనివర్సిటి, మరియు జస్టిస్ DVSS.సోమయాజులు , ఆంధ్రప్రదేశ్ హై కోర్టు రిటైర్డ్ జడ్జి పాల్గొంటున్నారు. ఈ సదస్సుకు కళాశాల అధ్యక్షులు ప్రొఫెసర్ K.C రెడ్డి అధ్యక్షత వహిస్తారని కళాశాల కార్యదర్శి డా.మధు కుమార్ తెలిపారు..

Use Social Media to Spread the Word about Our News

related articles