వివేకానంద రెడ్డి హత్యపై జగన్మోహన్ రెడ్డి పై విచారణ జరపాలి

by vvwnews.com

*వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరగాలి. రాజకీయ లబ్ధికోసం వైఎస్ వివేకానంద రెడ్డిని జగస్ ముఠానే హతమార్చింది: మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్*

ఈరోజు వైజాగ్ పార్టీ కార్యాలయం కేంద్రంగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరగాలి. రాజకీయ లబ్ధికోసం వైఎస్ వివేకానంద రెడ్డిని జగస్ ముఠానే హతమార్చింది. గొడ్డలి పోటుతోనే బాబాయి చనిపోయారు అని జగన్ రెడ్డి అంత కచ్చితంగా ఎలా చెప్పారు సీబీఐ విచారణ పిటిషన్ వేస్తానని సునీతమ్మ అంటే జగన్ ఎందుకు ఆపారు మొదట సీబీఐ విచారణ కోరిన జగస్ రెడ్డి తరువాత వద్దు అనడం వెనుక కారణాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. సీఎం అయిన తరువాత జగస్ రెడ్డి సీబీఐ విచారణ పిటిషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారు బాబాయిని చంపిన అబ్బాయిని జగస్ రెడ్డి రక్షించడం వెనుక ఆంతర్యం ఏమిటి వివేకా ఎలా చనిపోయారో జగస్ కి తెలుసు, మరి దాన్ని ఎందుకు దాచాలి అనుకుంటున్నారు? జగస్ రెడ్డి సీఎం కాగానే కేసు విచారణలో పురోగతి ఎందుకు ఆగిపోయింది? తన తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతుంటే తమ్ముడిని సీబీఐ అరెస్ట్ చేయకుండా జగన్ అడ్డుపడ్డారు హై ప్రొఫైల్ కేసులో కూడా ఇంత జాప్యానికి జగన్ రెడ్డే కారణం అని సునీతమ్మ చెప్పారు. నిజం బయటకు రాకుండా సీఎం జగన్ రెడ్డి ఆపుతున్నారు. కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే తన సోదరి వైఎస్ సునీత రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జగన్ రెడ్డి అండ్ కో సమాధానం చెప్పాలి.15. జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వివేకానందరెడ్డిని చంపిన నిజం ఒప్పుకోవాలి.ఇప్పటికైనా వైసీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలి.ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్ కు కనీస అర్హత కూడా లేదు.ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారు విలువలు, విశ్వసనీయత, మాట తప్పను.. మడమ తిప్పను లాంటి సోది డైలాగులు చెప్పడం ఇకనైనా వైసీపీ నాయకులు ఆపాలి.వివేకాను చంపిన వారిని వదిలి పెడితే మంచికి, చెడుకు అర్థం లేకుండా పోతుంది. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధం కాదు… హంతకులకు, రాష్ట్ర ప్రజలకు మధ్య యుద్ధం హత్యా రాజకీయాలకు… అభివృద్ధి రాజకీయాలకు మధ్య యుద్ధం వంచన, మోసం, కుట్రలు, కుతంత్రాలు చేసే పార్టీకి… అభివృద్ధి, సంక్షేమం చేసే పార్టీలకు మధ్య యుద్ధం సునీతమ్మ చేస్తున్న న్యాయ పోరాటంలో ఆమెకు టీడీపీ అండగా ఉంటుంది.వివేకానంద రెడ్డిని క్రూరంగా గొడ్డలితో నరికి నరికి చంపిన నరహంతకులకు శిక్ష పడకపోతే రేపు పౌరుని మాన, ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు. కావున సునీతమ్మ న్యాయ పోరాటానికి 5 కోట్లమంది పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలి. మన మాన, ధన ప్రాణాలకు రక్షణ ఉండాలంటే కచ్చితంగా సునీతమ్మ చెప్పినట్లుగా జగన్ రెడ్డిని ఓడించాలి అని మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles