CITU భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈనెల 28 29వ తేదీన నిరసన తెలియజేయాలని అందరికీ తెలియజేశారు

by vvwnews.com

మిత్రులారా!

సింగ్ హోటల్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు నర్సింగరావు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేశారు.
వివరాలు లోకెళితే రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28 29 నిరసన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలని దానిలో భాగంగానే ఈరోజు సింగ్ హోటల్ జంక్షన్ వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులు జనార్దన్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం సుబ్బారావు మాట్లాడుతూ భవన్ నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరిగిందని దశాబ్దాల పాటు ఇది భవనిర్మాణ కార్మికులకు ఉపయోగంగా ఉందని అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధిని పూర్తిగా ఖాళీ చేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని తద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమం ద్వారా రావలసిన పథకాలు అవి కూడా పెండింగ్లో ఉన్నాయని దీని వెంటనే పునరుద్దించాలని అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు CITU JAGADAMBA ZONE ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వం ఆదిలోనే ఇసుక మాఫియా అని పేరు చెప్పి ఇసుకను అందించకుండా చేశారని అలాగే సిమెంటు ఐరన్ ఈ పిక్క ఇటువంటి రేట్లు విపరీతంగా పెరిగిపోయి భవన నిర్మాణ కార్మికుల పని లేకుండా చేశారని కరోనాకాలంలో కూడా భవనిర్మాణ కార్మికులకు ఎటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి రాలేదని మొత్తం ఐదు సంవత్సరాలు బాధపడినది భవన నిర్మాణ కార్మికుల అని భవనిర్మాణ కార్మికుల యొక్క డబ్బుల్ని భవన్ నిర్మాణ కార్మికులకు అందజేయకపోవడం ఈ డబ్బులు వేరే కార్యక్రమాలు ఖర్చు పెట్టడం తీవ్ర అన్యాయం జరిగింది అని తెలియజేశారు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భవనిర్మాణ కార్మికులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ శ్రీను నాయుడు సిమ్మన్న పార్వతి వెంకటలక్ష్మి వంటి నాయకులు పాల్గొన్నారు.
ఇట్లు
KVP CHANDRAMOULI
CITU JAGADAMBA ZONE
GEN SEC.

Use Social Media to Spread the Word about Our News

related articles