ప్రచురణార్థం /ప్రసారార్థం
యువరైతు మరణానికి కారణమైన మోడీషాలు గద్దె దిగాలి – ఐద్వా
అన్నదాతను బిజెపి ప్రభుత్వం కాల్చి చంపడం అమానుషం.
కేంద్ర హోం మంత్రి ,హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.
దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులపై హర్యానా బిజెపి ప్రభుత్వం కాల్పులు జరిపించి శుభ్ కరణ్ సింగ్ అనే రైతును పొట్టన పెట్టుకున్నందుకు హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ కట్టర్, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని ఐద్వా ఆలిండియా సమావేశాలు సందర్భంగా కేంద్ర కమిటీ నాయకత్వం అద్వర్యం లో దాబా గార్టెన్ వద్ద ర్యాలీ మరియు మానవ హారం సందర్భంగా నాయకు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా ఆలిండియా అద్యక్ష కార్యదర్శి పి కె శ్రీమతి , మరియం ధావలే,కోశాధికారి పుణ్యావతి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలని అన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులు అప్పులు ,అవమానాలు పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నేడు దేశంలో నెలకొనడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలే కారణమన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ధరలు విపరీతంగా పెరిగాయని వీటిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు భారీగా కోత పెట్టిందని, దీనివలన రైతుల పంటకు పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర రాక రైతులు దివాలా తీస్తున్నారు అన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడు రైతు ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువస్తే వీటికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమించారని ఆ ఉద్యమానికి మోడీ ప్రభుత్వం తలొగ్గి నల్ల చట్టాలు రద్దు చేసిందని అన్నారు. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందంలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేస్తామని మోడీ ప్రభుత్వం అంగీకరించింది. సంవత్సరాలు గడుస్తున్న గిట్టుబాటు ధరల చట్టం చేయకపోవడంతో రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్నట్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తోంది.
ఇనుపకంచెలు, భారీ బారి కేడ్లు, రోడ్లపై ఇనుప మేకులు పాతించి రైతుల రక్తాన్ని చవిచూస్తోంది. అన్నదాతలపై హర్యానా బీజేపీ ప్రభుత్వం ఏకంగా కాల్పులకు తెగబడింది .రైతును బలితీసుకుంది. ఇందుకోసమేనా ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది అని బిజెపి పాలకులను కార్మిక సంఘాల నేతలు నిలదీశారు. ఈ అమానుషాన్ని తీవ్రంగా ఖండించారు .ఇది రాజకీయ హత్యని అన్నారు. దీనిపై 32 సెక్షన్ కింద కేసు నమోదు చేసి సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారం జరిపించాలని, దోషులను ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రముఖులు స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇచ్చి ఈయన చేసిన సిఫారసు ప్రకారం రైతుల పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయకపోవడం స్వామినాథన్ ను అవమానించడమేనన్నారు. ఇప్పటికైనా కేంద్రం బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో రైతు వ్యవసాయ కిట్టుబాటు ధర చట్టాన్ని తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలు నాయకులతో చిత్తశుద్ధితో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతే రాజు అని బయటకు ప్రకటించి ఆచరణలో రైతులను కాల్చి చంపడం, నిర్బంధం ప్రయోగించడం బిజెపి రైతు వ్యతిరేక ధోరణకి నిదర్శనం అన్నారు. రాష్ట్ర అద్యక్ష ,కార్యదర్శి బి.ప్రభావతి ,డి.రమాదేవి మాట్లాడుతూ రైతు లపై దాడి దేశంపై దాడి అన్నారు.రైతులపై నిర్బంధం ఆపకపోతే మోడీ ప్రభుత్వానికి, బిజెపి పాలకులకు ప్రజలు తగిన శాస్తి చేయక తప్పదని హెచ్చరించారు.కార్మిక కర్షక మైత్రితో రైతులు గిట్టుబాటు ధరచట్టం , సమస్యలు పరిష్కారమయ్యే వరకు విశాఖ కార్మిక వర్గం రైతుల పోరాటానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఆలిండియా నాయకులు సుజాత, కీర్తి సింగ్ ,సీమ , ప్రకృతి , సుసంకోడి ,ఇషితా ,షబ్బాని లతో పాటు ఐద్వా రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
వై.సత్యవతి
జిల్లా కార్యదర్శి