* మహిళలకు, రైతులకు, కార్మికులకు రక్షణ లేని ప్రభుత్వాలను గద్దె దింపండి*
*- ఐద్వా ఆల్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు పీకే శ్రీమతి, మరియు దావలె పిలుపు*
బిజెపి, బిజెపికి మద్దతిస్తున్న రాష్ట్రాలలో మహిళలకు, రైతులకు, కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని, ఈ ప్రభుత్వాలను 2024లో గద్దె దింపాలని ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పి.కె. శ్రీమతి, కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు.
ఐద్వా అఖిలభారత కార్యవర్గ సమావేశాలు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ప్రారంభం సందర్భంగా పీకే శ్రీమతి, మరియం దావలె మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల నుండి పెట్టుబడిదారీ అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మికులకు, మహిళలకు, రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం దుర్మార్గం అన్నారు. “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” అని మోడీ ప్రభుత్వం చెబుతోందని, ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకే వెలుగునిస్తున్న ప్రభుత్వమని దుయ్యబట్టారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అరగంటకి మహిళల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మహిళలపై దాడులు చేస్తున్న వారిని రక్షించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని విమర్శించారు. హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో నూ, ఢిల్లీ రాజధాని లోను పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పోరాడుతుంటే వారిపై మోడీ ప్రభుత్వం, హర్యానా బిజెపి ప్రభుత్వం కాల్పులు జరపడం, భాష్ప వాయువులు ప్రయోగించడం, నీటి ఫిరంగలను ఉపయోగించడం, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రోడ్లకి సిమెంట్ దిమ్మలు, మేకలు, భారీ ఎత్తున భారీకేడ్లు, ముల్లకంచెలను పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజ్యాంగానికి విరుద్ధంగా అయోధ్యలో రామ మందిరాన్ని ప్రచారం చేయడం ద్వారా దేశంలో మతాల మధ్య వివాదాలను పెంచి, హిందూ మతాన్ని ప్రధాన మతంగా తీసుకువచ్చి మత ఘర్షణలను పెంచుతున్నారని ధ్వజమెత్తారు . మైక్రో ఫైనాన్సుల నుండి, బ్యాంకుల నుండి రుణం తీసుకున్న పేద మహిళల రుణాలను, రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశంలో నిరుద్యోగం భారీగా పెంచి మద్యం, గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ జూదంల వైపు యువతను దారి మళ్ళిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, వేధింపులు పెరిగాయని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, బిజెపికి మద్దతు ఇస్తున్న వైయస్సార్సీపి ప్రభుత్వం విధానాలను మహిళా లోకం పెద్ద ఎత్తున కదలాలని కోరారు. 2024 ఎన్నికల్లో బిజెపికి దానికి సహకరిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
ఇట్లు
సత్యవతి వై
జిల్లా ప్రధాన కార్యదర్శి
ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు పీకే శ్రీమతి, దావలె పిలుపు”సబ్ కా సౌత్ సబ్ కా వికాస్” అని మోడీ ప్రభుత్వం
58