11th DISTRICT LEVEL INSPIRE MANAK AWARDS EXHIBITION & PROJECT COMPETITION 2022-23

by vvwnews.com

10 లక్షల మందిని భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే కార్యక్రమం ఇన్స్పైర్ మనక్
– ప్రతి విద్యార్థీ సృజనాత్మకత పెంచడానికి సైన్స్ ఎగ్జిబిషన్ ఉపకరిస్తుంది
– ఎకొ వైజాగ్ ను జయప్రదం చేయండి
– కె. ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి, విశాఖపట్నం
దేశంలో 10 లక్షల మంది విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే కార్యక్రమం ఇన్స్పైర్ మనక్ పోటీలు అని విశాఖపట్నం జిల్లా సైన్స్ అధికారి కె. ప్రసాద్ అన్నారు. గాజువాక లోని ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థలో 11వ జిల్లా స్థాయి ఇన్స్ పైర్ మానిక్ అవార్డుల కోసం ఎగ్జిబిషన్స్, ప్రోజెక్ట్ లో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సౌజన్యంతో ఎస్ ఇ ఆర్ టి-ఎపి పర్య వేక్షణలో, జిల్లా విద్యా శాఖ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహించడం జరిగింది అన్నారు. 2022- 23 విద్యా సంవత్సరంలో ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ కి ఎంపిక కాబడి 64 మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులు, గైడ్ సహకారంతో నమూనాను సిద్ధం చేసుకుని ప్రదర్శించడం జరిగింది అన్నారు . విద్యార్థుల్లో సృజనాత్మకత ను పెంచే ఈ ఎగ్జిబిషన్స్, ప్రోజెక్ట్ లకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విశాఖపట్నం మహానగరంలో అమలవుతున్న ఎకో వైజాగ్ గురించి వివరించారు. నగరంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని డిఇఓ చంద్రకళ ప్రారంభించారన్నారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి ఎం. గౌరీ శంకర్ రావు, అడిషనల్ ప్రోజెక్ట్ ఆఫీసర్ బొబ్బరాడ శ్రీనివాసరావులు పాల్గొన్నారని తెలిపారు
ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ బాబూరావు మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేసేందుకు నేషనల్ గ్రీన్ కార్ప్స్ కృషి చేస్తోంది అన్నారు. ప్రతి విద్యాసంస్థా, విద్యార్థీ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఇందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు.
గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ప్రతినిధి ఉమా రాజు పాల్గొని డ్రగ్స్ వినియోగించే వారి జీవితాలు ఎంత దుర్భరంగా తయారవుతుంది వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ యు – జివిఎంసి ప్రతినిధులు మంగ రాజు, దివ్య లు ఎకో వైజాగ్ గురించి అవగాహన కల్పించారు.
ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థ ప్రిన్స్ పాల్ జోజిబాబు,
గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ జి ఒ కార్యదర్శి జెవి రత్నం, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు .

Use Social Media to Spread the Word about Our News

related articles