విశాఖ టైల్స్ శానిటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం..
రానున్న రోజుల్లో వేసవి మరింత అధికం కానున్నది అని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని విశాఖ టైల్స్ అండ్ శానిటరీవేర్ మర్చంట్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
విశాఖ టైల్స్ అండ్ శానిటరీవేర్ మర్చంట్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మజ్జిగ చలివేంద్రం ప్రారంబించారు. బుల్లయ్య కళాశాల సమీపం లివింగ్ లైన్స్ సంస్థ వద్ద మజ్జిగ చలివేంద్రం ను అసోసియస్ అధ్యక్షులు అలుపన వెంకట రామకృష్ణ, సెక్రటరీ ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంబించారు.
ఈ సందర్భంగా వారిరువు మాట్లాడుతూ విశాఖ టైల్స్ అండ్ శానిటరీవేర్ ఆధ్వర్యంలో నిత్యం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుత వేసవి స్థితిగతులు దృష్ట్యా మజ్జిగ చలివేంద్రం ప్రారంబించాము అన్నారు. ఇక్కడ తో పాటు మధురవాడ, గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో తమ అసోసియేషన్ సభ్యులు సహకారం తో చలివేంద్రం సేవలు నిర్వహిస్తమన్నారు. మే, జూన్ నెలాఖరు వరకు మజ్జిగ చలివేంద్రం కొనసాగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రవీంద్ర , ట్రెజరర్ సంజయ్ పటేల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
విశాఖ టైల్స్ శానిటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం..#vvwnews
2
previous post