చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ద్విచక్ర వాహనం మీద యాత్ర చేస్తున్నారు విశాఖ to భద్రాచలం వరకు

by vvwnews.com

తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకొని ఈసరపు వాసు ద్విచక్ర వాహనం పై విశాఖపట్నం నుండి భద్రాచలం బయలుదేరడం కార్యకర్తల సంకల్ప బలం కు నిదర్శనం : మహమ్మద్ నజిర్, పాశర్ల ప్రసాద్.

జిల్లా తెలుగుదేశం పార్టీ ఆవరణలో విశాఖ పార్లమెంట్ విబ్బిన ప్రతిభవంతుల కమిటీ అధ్యక్షుడు ఈసరపు వాసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని విశాఖపట్నం నుండి భద్రాచలం వరకు ద్వి చక్ర వాహనం పై యాత్ర ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అనుబంధ కమిటీ ల ఇంచార్జ్ మహమ్మద్ నజిర్ విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్లప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. నజిర్ ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చు నిమిత్తం వాసు కి రూ 3000 లు బహుకరించారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ పార్లమెంట్ విబ్బిన ప్రతిభవంతుల కమిటీ అధ్యక్షుడు ఈసరపు వాసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఈరోజు విశాఖపట్నం జిల్లా పట్టి కార్యాలయం నుంచి భద్రాచలం రాముల వారి సన్నిధానానికి బయలుదేరుతున్నాడు తన మోటార్ సైకిల్ పై. ఈయనకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారు తరఫున మా అందరి తరపున కృతజ్ఞతలు

పాశర్లప్రసాద్ మాట్లాడుతూ వాసు చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం విశాఖ టు భద్రాచలం రాముల వారి దేవస్థానం వరకు కార్యక్రమముని ఇలా ఎన్నో కార్యక్రమాలకు ముందు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటాడు. వాసుకి ఈ యాత్ర విజయవంతము గా పూర్తి చేసుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాము.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పతివాడ గిరిధర్ బొట్ట పరదేశి యాదవ్ మహమ్మద్ గౌస్, పెద్దడ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు

ఇట్లు
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం
విశాఖపట్నం

Use Social Media to Spread the Word about Our News

related articles