ఆయిల్ కంపెనీలు ధరల పెంచుకోవడానికిగత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి

by vvwnews.com

ప్రెస్ నోట్ ఆయిల్ కంపెనీలు ధరల పెంచుకోవడానికిగత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం భారీగాపెంచిన డీజిల్ పెట్రోల్ వాహనాలకు వాడే సిఎన్ జి ఎల్ పి జి కమర్షియల్ గ్యాస్ ధరలనువెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 4 6 2026 ఉదయం 9 గంటలకి ద్వారకానగర్ బుద్ధుని పార్క్ ఆటో స్టాండ్ వద్ద నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధం జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుజివామనమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ధరల పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీజిల్ పెట్రోల్ టోల్ పంజాబ్ ఫీజులు వాహన విడుభాగాల ధరలు రోడ్ టాక్స్ గ్రీన్ టాక్స్ భారీగా పెంచి రవాణా రంగాన్ని దివాలా తీయించే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆటో అండ్ మోటార్ డ్రైవర్లు పోరాడాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుడీజిల్ పెట్రోల్ పై వేసిన వ్యాట్ సెస్ పన్ను లునువెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు అంతర్జాతీయ మార్కెట్లో కురుడాయిలు బేరల్ 67 డాలర్లకు తగ్గిన దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారుఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులు ఆర్థిక భారాలు వేసే డీజిల్ పెట్రోల్ టోల్ పంజా ఫీజులు తరుడు పార్టీ ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ వాహన విభాగాలధరలు భారీగా పెరిగి ఆదాయం లేక వాహనాలకు ఫైనాన్సులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్న మోటార్ వాహన డ్రైవర్లను ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు ఆయిల్ కంపెనీ నష్టాల పేరుతో వాహనదారులపై లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారాలు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లేదని విమర్శించారు పెరిగిన ధరలపై ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చట్టసభల్లో వ్యతిరేకించి ప్రజల పక్షాన ఉంటారా దోపిడీదారుల పక్షాన నియంతర ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు దేశంలో డీజిల్ పెట్రోల్ ధరలపై వ్యాటు సెస్సు జిఎస్ టి పన్నులు 30 లక్షల కోట్లకు పైగా వాహనదారులపై ఆర్థిక ఆర్థిక వేసిందని మండిపడ్డారు మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజీలు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ప్రజల వాడే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు తమ బ్యాంకు అకౌంట్లో వేస్తామని సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచిన ఒక్క ఆమె అమలు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు భారత్ ఎన్నికల సంఘం ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలకు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలనువెంటనే అమలు చేయాలని భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు బ్రతుకు రక్షణ కల్పించాలని కోరారు లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు కార్యక్రమంలో ఆటో స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ రవికృష్ణ జి మురళి దేవరాజు కే దేవుడు వై సంతోష్ కే రాజు ఎస్ పైడ్రాజు ఎం రాజు కే రాజు ఏ నర్సింగ్ ఎల్ లక్ష్మణ్ ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు యు శివాజీ ఆటో స్టాండ్ అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles