.అబద్దాలకోరు చంద్రబాబు…
* చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో 41 వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్ల అయిందని 41 వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైఎస్ఆర్సిపి క్లస్టర్ ఇంచార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. జ్ఞానాపురం వద్ద గురువారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో బాండ్ ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమ మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఇచ్చిన ఒక హామీను కూడా నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో అన్ని అవకతవకలేనని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. నిరుద్యోగభృతి , 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలను పూర్తిగా అటకెక్కించారన్నారు. సంక్షేమ పాలన సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి లక్షల ఉద్యోగాలు కల్పించి, విద్య వైద్యానికి సముచిత స్థానం కల్పించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కుమారుడికి మాత్రమే ఉద్యోగం ఇచ్చాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబుకు మించిన అబద్ధాలు ఆడుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇంకా యువతని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 41 వ వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మహిళా నేతలు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.