0
*ఈఎస్ఐ…ఎంపీ*
విశాఖ జిల్లా,గాజువాక సమీపం షీలానగర్‌లో నిర్మిస్తోన్న 400 పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు లు పరిశీలించారు.పనుల పురోగతిని అక్కడున్న ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.దాదాపు 80 శాతం పూర్తయిన నిర్మాణ పనుల వివరాలను కే ఎమ్ వి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధులు తెలియజేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి వచ్చే జూన్,జూలై నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.హాస్పిటల్ పూర్తయితే కనీసం 40 వేల మంది కార్మికులకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.విశాఖ నగరానికే ఈ ఆసుపత్రి తలమానికంగా నిలుస్తుందని తెలిపారు