ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జయప్రదం చేయండి !! #vvwnews

by vvwnews.com

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జయప్రదం చేయండి
– ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం
– ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి
– మనిషి జీవుల గూడులో ఒక భాగం
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం మద్దిలపాలెం లో ఉన్న అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, అదే ఆహారం భుజించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంతే కాక రసాయనాల కాలుష్యం వల్ల అంతరించి పోతున్న మన రైతు నేస్తాలైన కప్పులు, పీతలు, బీ ఈటర్స్, కత్తెర పిట్టలు, పాలెం పిట్టలు ఇలా అనేక రకాల జీవులను కాపాడుకున్న వారమవుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించితే అందరి ఆరోగ్యం కాడగలుతామనీ, సమస్త జీవరాశినీ జివించేందు ఉపకరిస్తుంది అని వివరించారు. మనిషి జీవుల గూడు నేయలేదు అని, భూమి మీద ఉన్న జీవుల గూడు లో ఒక భాగం అనే అంశం గుర్తుంచుకోవాలి అని కోరారు. అందుకే మనం ఆరోగ్యంగా ఉందాం, సమస్త జీవరాశినీ జివించేందు ఉపకరించే కార్యక్రమాలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ భావన విద్యా నికేతన్ కరస్పాండెంట్ షణ్ముఖ కుమార్, అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ వెంకటేష్, రత్నం, గ్రీన్ క్లైమేట్ టీం సమన్వయకర్త లు జె రాజేశ్వరి, ఐ కృష్ణ కుమారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles